Andhra Pradesh : ఏపీ VROలపై మంత్రి అప్పలరాజు చిందులు

Andhra Pradesh : VROలపై ఏపీమంత్రి అప్పలరాజు చిందులేశారు. వారి ఆవేదన వినకుండానే ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో OTS పై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సచివాలయ సిబ్బంది, VROలను పిలిచారు. మంత్రి వచ్చే సమయానికి VROలు బయటకు వెళ్లిపోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. దీంతో సమావేశానికి పిలిచి అవమానించారంటూ VROలు నిరసన తెలిపారు. ఇంతలో అక్కడికి వచ్చిన మంత్రి అప్పలరాజు అసలు విషయం తెలుసుకోకుండా చిందులేశారు. ఉద్యోగాలు చేయటానికి ఉన్నారా లేక ఉద్యమాలు చేయటానికా అంటూ ఆగ్రహించారు. VROలకు మెమో జారీ చేయాలంటూ కమిషనర్ ను ఆదేశించారు. అక్కడితో ఆగకుండా ఇకపైన పలాస నియోజకవర్గంలో VROల సేవలు అవసరం లేదన్నారు. రేపటినుంచి ఎవరైనా VRO విధులకు హాజరైతే... సర్పంచ్, MPTCలు వాళ్లను సచివాలయం నుంచి బయటకు గెంటేయాలని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com