AP Kondapalli MP Elections: కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా

AP Kondapalli MP Elections: ఏపీలో ఉత్కంఠ.. వివాదాస్పదంగా మారిన కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాన్ని సృష్టించింది. దొడ్డిదారిన ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి టీడీపీకి 16, వైసీపీ 15 సీట్లు బలం ఉంది.
ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా.. సభలో ఏకంగా దౌర్జన్యాలకు దిగింది. వైసీపీ అభ్యర్థులు గొడవ చేయడంతో సజావుగా జరగాల్సిన కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
ఉదయం నుంచి కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికపై హైటెన్షన్ నెలకొంది. క్యాంపు నుంచి టీడీపీ కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే సభ ప్రారంభం నుంచే వైసీపీ అభ్యర్థులు గొడవకు దిగారు. సభలో వైసీపీ ఎమ్మెల్యే, కౌన్సిలర్లు బల్లలు విరగొట్టి కాగితాలు చింపివేశారు.
దీంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో డిప్యూటీ కలెక్టర్.. ఛైర్మన్ ఎన్నికలను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఛైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేయడంపై ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు కౌన్సిల్ హాలులోనే బైఠాయించి నిరసన తెలిపారు. కోరం ఉన్నా ఎన్నికలు జరపకుండా వైసీపీ ఒత్తిడికి తలొగ్గి అధికారులు కావాలనే వాయిదా
వేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. వాయిదా వేస్తే లిఖితపూర్వకంగా ఇవ్వమని ఆర్‌ఓను కోరినా పట్టించుకోవడం లేదని ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com