Andhra Pradesh Elections: ఏపీ స్థానిక ఎన్నికలకు నామినేషన్లు.. టీడీపీకి వైసీపీ అడ్డంకులు..

Andhra Pradesh Elections: ఏపీ స్థానిక ఎన్నికలకు నామినేషన్లు.. టీడీపీకి వైసీపీ అడ్డంకులు..
Andhra Pradesh Elections: ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

Andhra Pradesh Elections: ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ ను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 8 వరకు మున్సిపాలిటీ, కార్పొరేషన్ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు అధికారులు. ఇక 9వరకు పంచాయతీ, పరిషత్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత.. అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈనెల 14న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉండనుంది. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ఈనెల 15న జరగనున్నాయి. ఈనెల 17న కౌంటింగ్ జరగనుంది. MPTC, ZPTC ఎన్నికలు 16న ఉన్నాయి. 18న కౌంటింగ్ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

పలు మున్సిపాలిటీల్లో టీడీపీ నామినేషన్ వేయకుండా అడ్డంకులు సృష్టించారు వైసీపీ లీడర్లు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థిపై దాడి చేశారు. నామినేషన్ పత్రాలు చించేశారు. నెల్లూరులోనూ టీడీపీ అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. వైసీపీ నేతల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు. కొందరు ప్రభుత్వ అధికారులు, పోలీసులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story