Andhra Pradesh: ప్రేక్షకులపై అదనపు చార్జీల భారం లేకుండా ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు..

Andhra Pradesh: ప్రేక్షకులపై అదనపు చార్జీల భారం లేకుండా ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు..
Andhra Pradesh: ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Andhra Pradesh: ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే టికెట్ల అమ్మకాల కోసం టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. దీనికోసం పలు కంపెనీలు పోటీ పడ్డాయి. చివరగా ఈ టెండర్లలో జస్ట్ టికెట్ సంస్థ నిలిచి ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్స్ నిర్వహణని సొంతం చేసుకుంది.

ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ కాస్ట్ తో ప్రభుత్వమే దీనిని నిర్వహించబోతుంది. ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ లో సినిమా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మేలా చేస్తామన్నారు ప్రభుత్వ నిర్వాహకులు. ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం కూడా ఉండదని తెలిపారు. అయితే ఈ ఆన్లైన్ టికెట్ విధానంలో డబ్బులు ప్రభుత్వంకి రాగా వాటిని తర్వాత థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story