SI Exam Results: ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు(SI Exam Results) విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,288మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఫిబ్రవరి 28న ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 57,923మంది అభ్యర్థులు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు. వారందరికీ దేహదారుఢ్య పరీక్ష పీఎంటీ/పీఈటీకు హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. అయితే, దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్షకు హాల్ టికెట్లు ఇచ్చారు. తుది రాత పరీక్ష నాలుగు పేపర్లకు నిర్వహించిన అధికారులు తాజాగా ఫలితాలు వెలువరించారు.
మొత్తం 411 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో 18,637 మంది క్వాలిఫై కాగా ..వీరిలో మెరిట్ లో నిలిచిన 411 మందిని పోస్టులకు ఎంపిక చేయనున్నారు. మరి 18,637 మందిలో పోస్టులకు అపాయింట్ మెంట్ అయ్యేది ఎవరో అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com