AP TET Result: మరి కాసేపట్లో ఏపీ టెట్ ఫలితాలు.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్ని మంత్రి లోకేశ్ సోమవారం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాల్ని https://www.eenadu.net https://pratibha.eenadu.net వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించగా.. 3,68,661 మంది పరీక్షకు హాజరయ్యారు.
కాగా ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 17 రోజుల పాటు నిర్వహించారు. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది అంటే 86.28% మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ మార్కులకు డీఎస్సీ పరీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. మెగా డీఎస్సీ నేపథ్యంలో టెట్ ఫలితాల కోసం అభ్యర్ధులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
టెట్ ఉత్తీర్ణత శాతం కమ్యూనిటీ వారీగా వేరువేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఓసీ(జనరల్) కేటగిరీలో 60 శాతం మార్కులు ఆపైన వస్తే ఉత్తీర్ణత పొందినట్లు అవుతుంది. ఇక బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు ఆపైన, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలో 40 శాతం మార్కులు ఆపైన మార్కులు పొందిన వారు మాత్రమే టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com