Ramoji Rao: రామోజీకి నివాళిగా.. ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు

Ramoji Rao: రామోజీకి నివాళిగా.. ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలు
X
ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు నివాళిగా సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 9, 10 తేదీలను సంతాప దినాలుగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు రోజుల పాటు జాతీయ పతాకాన్ని సగం వరకూ అవనతం చేయాలని పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలూ నిర్వహించవద్దని చెప్పారు. అలాగే, రామోజీరావు అంత్యక్రియలకు ఏపీ సర్కారు తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ హాజరుకానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున రామోజీరావు పార్దీవ దేహంపై పుష్ప గుచ్ఛం ఉంచి నివాళి అర్పించనున్నారు. కాగా, రామోజీ రావు అంత్యక్రియలను తెలంగాణ సర్కారు అధికారిక లాంఛనాలతో జరపనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావుకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప దార్శనికుడు, ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేసిన అక్షర యోధుడ్ని భారతావని కోల్పోయిందంటూ]సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివదేహం వద్దనివాళులర్పించి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన రామోజీ సంస్థల అధిపతి రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించికుటుంబసభ్యులను ఓదార్చారు.సమాజహితం కోసం అనునిత్యం కష్టపడిన రామోజీరావు మరణం తెలుగుజాతికి తీరుని లోటు అని చంద్రబాబు తెలిపారు. ధర్మం ప్రకారం పనిచేస్తానని స్పష్టంగా చెప్పేవారన్న చంద్రబాబు, చిత్రపరిశ్రమకు కూడా ఎనలేని సేవలు చేశారని , అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిల్మ్‌సిటీని తీర్చిదిద్దారని కొనియాడారు. యుగ పురుషుడి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరయోధుడి మరణం తనను తీవ్రంగా కలచి వేసిందన్న ఆయన రామోజీరావు తెలుగు జాతి వెలుగు అని అన్నారు.

Tags

Next Story