ఏపీకి మరో గండం... దూసుకొస్తోన్న మరో తుఫాన్

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరో గండం పొంచి ఉంది. జవాద్ రూపంలో మరో తుఫాన్ ముప్పు ఏపీ వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలోని అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో 3వ తేదీ నుంచి ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
ముంచుకొస్తున్న జవాద్ తుఫానుతో ఇండియన్ రైల్వేశాఖ అప్రమత్తం అయింది. మూడు రోజుల పాటు మొత్తం 95 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తూర్పు,కోస్తా, దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. 2వ తేదీన సిల్చర్-త్రివేండ్రం సెంట్రల్, బెంగుళూరు కంటోన్మెంట్-గౌహతి, త్రివేండ్రం-షాలీమార్, కన్యాకుమారి-దిబ్రుఘర్, అహ్మదాబాద్-పూరీ రైళ్లను రద్దు చేశారు.
అలాగే 3న పూరీ-గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్-ఫలక్‌నుమా, పూరీ-యశ్వంత్ పూర్ గరీభీరథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రగాచ్చి-చెన్నై, డిగా-విశాఖపట్నఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్‌ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, కొర్బా-విశాఖ రైళ్లు రద్దయ్యాయి.
ఇక.. 4వ తేదీన భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, హాటీయా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్‌ప్రెస్, విశాఖ-కిరండోల్ సహా మొత్తం 95 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు, కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలం కాగా.. ఇప్పుడు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంతటి ప్రళయం సృష్టిస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com