AndhraPradesh: మాజీ ఎమ్మెల్యే గృహ నిర్భంధం

AndhraPradesh: మాజీ ఎమ్మెల్యే గృహ నిర్భంధం
హనుమంతరాయ చౌదరి గృహనిర్భంధం; పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. నూతిమడుగు, భానుకోట గ్రామాల పరిధిలో మంత్రి బలవంతపు భూ అక్రమ కొనుగోళ్లు చేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు.


ఈ నేపథ్యంలో వారికి బాసటగా నిలిచేందుకు వెళ్లాలని హనుమంతరాయ చౌదరి తలపెట్టారు. దీంతో తెల్లవారుజామునే నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆయన్ను గృహ నిర్భందం చేశారు. భూముల వద్దకు వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Tags

Read MoreRead Less
Next Story