AndhraPradesh: సీఐడీ విచారణకు చింతకాయల విజయ్

టీడీపీ నేత చింతకాయల విజయ్ సోమవారం సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న విజయ్ మొదట టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నేతలతో మాట్లడిన విజయ్ సీఐడీ కార్యాలయానికి బయల్దేరారు. ఆయనతో పాటు తన తండ్రి టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, బుద్దా వెంకన్న, పట్టాభి కూడా సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. భారతీపే యాప్ పేరుతో సీఎం జగన్ భార్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో కేసు నమోదు చేశారు. మొదట ఈనెల 27న హాజరు కావాలని సీఐడీ నోటీసులు ఇచ్చారు అయితే ఇవాళ హాజరు అవుతానని తెలిపారు. లాయర్ సమక్షంలో చింతకాయల విజయ్‌ను విచారించాలని సీఐడీ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 41A నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు అయ్యన్న పాత్రుడు. సోషల్ మీడియాలో మిస్ బీహేవ్ చేశారని కేసుపెట్టారని కోర్టు ఆదేశాలతో విచారణకు విజయ్ హాజరవుతున్నారని, విచారణ పూర్తైయ్యాక అన్నీ విషయాలు మాట్లాడుతానని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com