Nellore: అంగన్వాడీ టీచర్ కర్కశం.. ఆరేళ్ల చిన్నారి ఒంటిపై వాతలు..

Nellore: అంగన్వాడీ టీచర్ కర్కశం.. ఆరేళ్ల చిన్నారి ఒంటిపై వాతలు..
Nellore: నెల్లూరు జిల్లాలో అమానుషం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై అంగన్వాడీ టీచర్ కర్కశంగా ప్రవర్తించింది.

Nellore: నెల్లూరు జిల్లా బోగోలు మండలం బృందావనంలో అమానుషం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై అంగన్వాడీ టీచర్ కర్కశంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తుందని చాకు కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టింది. బాలిక ఒంటిపై కాలిన వాతలు చూసి తల్లి కన్నీటి పర్యంతమైంది. చిన్నారని కూడా చూడకుండా ఇలా ఎలా ప్రవర్తించిందంటూ ఆతల్లి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఇక అంగన్వాడీ టీచర్‌ భవాని తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు అల్లరి చేస్తే.. సర్దిచెప్పాల్సింది పోయి సైకోలా వాతలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. వెంటనే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story