MLA Amilineni :పేదలకు వరం అన్నా క్యాంటీన్లు : ఎమ్మెల్యే అమిలినేని

రాష్ట్రంలో పేదల బ్రతుకుల్లో ఆనందం చూడాలని పరితపించి వారికి కడుపునిండా పట్టేడు అన్నం పెట్టాలని నాడు నందమూరి తారక రామారావు పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం అందిస్తే నేడు చంద్రన్న పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. సుపరి పాలనలో తొలి అడుగులో భాగంగా అన్నా క్యాంటీన్లో నాయకులు, సామాన్యులతో కలసి టిఫిన్ చేసి అక్కడే స్థానికులతో మాట్లాడారు.. టిఫిన్ ఎలా ఉంటుంది, భోజనం రుచికరంగా ఉంటుందా, ప్రతి రోజు ఏమేమి పెడుతున్నారు అంటూ, ఇంట్లో ఇలాగే అన్ని రకాల వంటలు చేసుకుంటారా అంటూ టిఫిన్ చేస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు మూడు పూటల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసేశారని దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిచారని అన్నారు.. నాణ్యమైన భోజనం, రుచికరమైన టిఫిన్లు పెడుతూ పేదలకు వరంగా అన్నా క్యాంటీన్లు నిలుస్తున్నాయని, కళ్యాణదుర్గం పట్టణంలో వాల్మీకి సర్కిల్లో కూడా మరొక అన్నా క్యాంటేన్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తామని, ప్రతి మండలంలోను అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇంతమంది పేద ప్రజలకు వరమైన అన్నా క్యాంటీన్లు ఏర్పాటులో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ్యాణదుర్గం ప్రజలందరి తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు..
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com