219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన

219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రకటన
219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మొత్తం 18 మంది ఉపాధ్యాక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు..

219 మందితో ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. మొత్తం 18 మంది ఉపాధ్యాక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులతో పాటు... 18 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులతో టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు.

రాష్ట్ర కమిటీలో బడుగు వర్గాలకు పెద్దపీట వేశారు టీడీపీ అధినేత. మొత్తం కమిటీలో బడుగు వర్గాలకు 61 శాతం పదవులు దక్కగా.. బీసీలకు 41 శాతం పార్టీ పదవులు ఇచ్చారు. 50 ఉప కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. వారసత్వాని కంటే పని తీరుకే ప్రాధాన్యత ఇచ్చారు. అంతే కాదు యువ నాయకత్వానికి కమిటీలో పెద్దపీట వేశారు. అన్ని కులాలు, అన్ని ప్రాంతాల సమతుల్యంతో టీడీపీ రాష్ట్ర కమిటీకి తుది రూపు ఇచ్చారు. ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతో మంది కొత్త వారికి.. రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడం రాజకీయంగా చర్చినీయాంశం అయ్యింది.

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిమ్మల కిష్టప్ప, పత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నంతో పాటు... దాట్ల సుబ్బరాజు, సాయికల్పనా రెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, సుజయకృష్ణ రంగారావును నియమించారు. ఇక బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, బాబూ రాజేంద్రప్రసాద్, తిప్పేస్వామి, హనుమంతరాయ చౌదరి, నర్సింహారెడ్డి, దామచర్ల జనార్థన్‌రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద సూర్య ఉపాధ్యాక్షులుగా రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది.

అటు ప్రధాన కార్యదర్శులుగా పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, దేవినేని ఉమ, ఎన్. అమర్‌నాథ్‌రెడ్డి, బాలవీరాంజనేయ స్వామి, బీటీ నాయుడు, భూమా అఖిలప్రియ నియమితులయ్యారు. MD నజీర్, గన్ని కృష్ణ, పంచుమర్తి అనురాధ, చెంగల్‌రాయలు, గౌతు శిరీష, దువ్వారపు రామారావు, బుద్దా వెంకన్న, చింతకాయల విజయ్, మద్దిపాటి వెంకట్రాజుకు కూడా ప్రధాన కార్యదర్శుల జాబితాలో చోటు కల్పించారు.

టీడీపీ పునర్నిర్మాణంతో నూతనుత్సాహాన్ని నింపుతున్నారు అధినేత చంద్రబాబు. పార్టీలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఇప్పటికే పార్టీ వ్యవస్థకి స్వస్తి పలికి.. పార్లమెంటరీ పార్టీ వ్యవస్థని తీసుకొచ్చారు. ఇటీవల పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీలను ప్రకటించిన టిడిపి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ప్రకటించింది.ఇప్పటికే టిడిపి ఏపీ అధ్యక్షుడిగా బీసీ నేత అచ్చెన్నాయుడుని ప్రకటించిన అధినేత చంద్రబాబు.. సుదీర్ఘ కసరత్తు తరువాత ఏపీ రాష్ట్ర కమిటీ ఎంపికను పూర్తి చేసారు.

Tags

Read MoreRead Less
Next Story