Vijayawada : బెజవాడకు మళ్లీ 2 రోజుల వాన సూచన.. అల్పపీడనం ప్రభావం

Vijayawada : బెజవాడకు మళ్లీ 2 రోజుల వాన సూచన.. అల్పపీడనం ప్రభావం

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వరుస రోజుల వర్ష సూచన చేసింది వెదర్ డిపార్టుమెంట్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ వాయుగుండం బలపడే అవకాశముంది. రానున్న రెండ్రోజులలో ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ తీరాలకు చేరుకునే అవకాశముంది. అల్పపీడనంకు అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో అనకాపల్లిలోని చోడవరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంద్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని, మత్య్సకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Next Story