Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు.. కర్నూలుకు తరలింపు

వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత గట్టు తిలక్ గతంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆయనను పీటీవారెంట్‌పై కర్నూలుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. బోరుగడ్డ అనిల్‌పై ఇప్పటికే పలు కేసులున్నాయి. రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ 2021లో కర్లపూడి బాబుప్రకాశ్‌ను బెదిరించిన కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్నారు. గతేడాది మార్చి 31న బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి కేసులో అనిల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఏ1గా, అనిల్ ఏ2గా ఉన్నారు. కాగా, బోరుగడ్డ అనిల్ కుమార్ ఆగడాలపై బాధితులు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com