Another Cyclone Threat : మరో తుపాను ముప్పు.. 6,7 తేదీల్లో అల్పపీడనం

Another Cyclone Threat : మరో తుపాను ముప్పు.. 6,7 తేదీల్లో అల్పపీడనం
X

వాయుగుండం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఏపీకి మరో ముప్పు రానుంది. ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటనుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరకొస్తా, దక్షిణ ఒరిస్సా ఛత్తీస్ గఢ్ ప్రాంతాలను ఆనుకొని కొనసాగుతోంది.

Tags

Next Story