ఏపీలో మరో ఘోరం.. హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో హనుమంతుడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ రూరల్ సి.ఐ ఆకుల మురళీ కృష్ణ, ఎస్సై సతీష్‌లు విచారణ చేపట్టారు..
పోలీసుల గస్తీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.. ఇదే మండలంలో గత రాత్రి జాతరలో జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందాడు.. ఇప్పుడే అదే గ్రామానికి సమీపంలో విగ్రహ ధ్వంసం జరిగింది. మరోవైపు హిందూ దేవతల విగ్రహాలపై దాడులు జరుగుతుండడం వెనుక కుట్ర ఉందని.. దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. అయితే సుంకరపాలెం జంక్షన్‌లో ఉన్న సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో.. జాగిలాలతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com