Heavy Rain : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: ఏపీకి భారీ వర్ష సూచన...

ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వివరాల ప్రకారం.. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 25న అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా బలపడి 27వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com