AP : వైసీపీకి మరో షాక్.. జనసేనలోకి అవంతి శ్రీనివాస్

AP : వైసీపీకి మరో షాక్.. జనసేనలోకి అవంతి శ్రీనివాస్
X

ఏపీలో ఓటమి భారం, కేసులతో సతమతమవుతున్న వైఎస్ఆర్ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను YCP అధినేత జగన్మోహన్‌రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో YCPకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. జగన్‌ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాస్‌. అవంతి జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. జనసేన బలోపేతంపై తీవ్రంగా దృష్టిపెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి వచ్చే లీడర్లను జనసేన వైపు ఆకర్షిస్తున్నారు. ఈ పరిణామాలు ఎంతదూరం వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story