Vande Bharat : విశాఖకు మరో వందే భారత్ రైలు

Vande Bharat : విశాఖకు మరో వందే భారత్ రైలు
X

విశాఖకు మరో వందేభారత్‌ రైలు ( Vande Bharat ) అందుబాటులోకి రానుంది. దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది అవుతుంది. రాయ్‌పుర్‌-విజయనగరం మార్గంలో ఇది మొదటిది. దుర్గ్-విశాఖపట్నం వందే భారత్.. దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.

నాగ్‌పుర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్‌ నుంచి ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభిస్తారు. నాగ్‌పుర్‌లో బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాత్రి 10.45 గంటలకు చేరుకోనుంది. ఈ రైలుకు స్వాగతం పలికేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌-నాగ్‌పుర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

Tags

Next Story