Visakhapatnam : మరో యువతిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటన మరువకముందే విజయనగరం జిల్లా శివరాంలో అఖిల అనే యువతిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అతను అఖిల కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణమా? అని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. యువతి ప్రస్తుతం కోలుకుంటోందని తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే కేసును ఛేదిస్తామని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అఖిలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి కొండపల్లి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com