AP : సోషల్ మీడియా పోస్టుల కేసులో మరో వైసీపీ నేత అరెస్ట్

AP : సోషల్ మీడియా పోస్టుల కేసులో మరో వైసీపీ నేత అరెస్ట్
X

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తమను టార్గెట్ చేసినందుకు ప్రతిగా టీడీపీ ప్రభుత్వం తన దూకుడు కొనసాగిస్తోంది. వైసీపీ నేత ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌గా కొరిటిపాటి ప్రేమ్‌ కుమార్‌ కొనసాగుతున్నారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీసులు ప్రేమ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్‌ బిల్లులు, టోల్గేట్‌ ఫీజులు, ఇలా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రేమ్‌ కుమార్‌ టీడీపీ కండువా కప్పుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని నల్లపాడు పీఎస్‌కు తరలించారు. ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌ను కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Tags

Next Story