AP: ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది : అదితి ఫెడ్నిస్‌

AP: ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది : అదితి ఫెడ్నిస్‌
ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక బిజినెస్‌ స్టాండర్డ్ కు ఏపీ ఆర్థిక పరిస్థితిపై వ్యాసం

ఏపీ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందన్నారు ప్రముఖ జర్నలిస్టు అదితి ఫెడ్నిస్‌. ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక బిజినెస్‌ స్టాండర్డ్ కు ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆమె వ్యాసం రాశారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పులు 33 శాతానికి చేరాయని వివరించారు. రెవిన్యూ వచ్చే ముఖ్యమైన విభాగాలను బ్యాంకు సెక్యూరిటీగా పెట్టారని...కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.

కొందరు ఉద్యోగులకు నాలుగు నెలలైనా జీతాలు అందలేని పరిస్థితి ఉందన్నరు. పెన్షనర్లకు సైతం 20వ తేదీ వరకు చెల్లింపులు జరగడం లేదన్నారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్‌ సైతం ఒప్పుకున్నారని వివరించారు. డబ్బులే లేని పరిస్థితుల్లో అమరావతి, కర్నూలు, విశాఖపట్నంకు డబ్బులు ఎలా వస్తాయన్నారు. వికేంద్రీకరణ పేరుతో అంతా గందరగోళంగా తయారైందన్నారు. ఏపీ రాజధాని ఏంటన్నది ఇప్పటికీ స్పష్టత లేదన్నారు అదితి ఫెడ్నిస్‌.

Tags

Read MoreRead Less
Next Story