AP : రోడ్డెక్కిన ఉభయగోదావరి జిల్లా రైతులు

AP : రోడ్డెక్కిన ఉభయగోదావరి జిల్లా రైతులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్యక్షులు కేవి ముకుందరెడ్డి అన్నారు

ఉభయగోదావరి జిల్లాల్లో ఫౌల్ట్రీ రైతులు ఆందోళన చేపట్టారు. ఏపీ ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేవరపల్లి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. నాలుగు కోడిగుడ్ల లారీలను అడ్డుకున్నారు. ఫౌల్ట్రీ రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న కోడిగుడ్డుకు అప్‌ కమింగ్ రేటు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఫౌల్ట్రీ రైతులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్యక్షులు కేవి ముకుందరెడ్డి అన్నారు. గత నాలుగు రోజులుగా కోడిగుడ్ల ఎగుమతిని నిలిపివేసి ధర్నా చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. దళారుల గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవాలని ఫౌల్ట్రీ ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు.

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళనబాట పట్టారు. అమలాపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆక్వా జోన్.. నాన్‌ ఆక్వా జోన్‌ పరిమితి లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 10 ఎకరాల లోపు ఆక్వా చెరువులు ఉన్న ప్రతీ రైతుకు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఈ ఫిష్‌ సర్వే ద్వారా నూటికి 70 శాతం మంది రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని స్పందనలో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story