AP : "కొడాలి నాని ఇళ్లు కూల్చేందుకు అధికారులను పంపాడు"

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నాగవరప్పాడులో అక్రమంగా నిర్మించారంటూ ఇళ్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొక్లయిన్‌కు అడ్డంగా కూర్చొని కూల్చివేతలను మహిళలు అడ్డుకున్నారు.. ఒక్కడి కోసం ఇంత మందిని రోడ్డున పడేస్తారా అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.. అధికారుల కాళ్లు పట్టుకుని బతిమాలినా ఫలితం లేకపోయింది.. అధికారులు బలవంతంగా ఇళ్లను కూల్చేయడంతో మహిళలు ఆవేదనతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తలెత్తింది.
గడప గడపకు కార్యక్రమానికి వచ్చినప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చిన కొడాలి నాని ఇప్పుడు ఇళ్లు కూల్చేందుకు అధికారులను పంపించాడంటూ మహిళలంతా దుమ్మెత్తి పోశారు.. వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్న తనకే ఇళ్ల స్థలం కేటాయించలేదని ఈ సందర్భంగా ఓ మహిళ వాపోయింది.. అటు బాధితులకు టీడీపీ నేతలు అండగా నిలిచారు.. కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com