AP : విశాఖకు తరలుతున్న అధికార యంత్రాంగం

పరిపాలన రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు మార్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. సీఎం అధికారిక నివాసంతో పాటు, అనువైన భవనాలను గుర్తించే పనిలో అధికారిక యంత్రాంగం నిమగ్నమైంది. రాజధాని తరలింపుపై జిల్లా అధికారులకు ఇంకా ఉత్తర్వులు రానప్పటికీ, మందస్తుగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఉత్తర్వులు ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి, సీఎస్, ఐఏఎస్ అధికారుల కార్యాలయాలు, నివాస భవనాలు గుర్తించే పనిలో విశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. జనవరి 31న న్యూఢిల్లీలో జరిగిన సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం త్వరలో రాజధాని అవుతుందని ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కర్డెన్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. "రాబోయే రోజుల్లో మన రాజధానిగా మారబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను కూడా రాబోయే నెలల్లో విశాఖకు మారతాను" అని జగన్ అన్నారు.
వైఎస్ఆర్ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా నిర్ణయించింది. దీంతో రాజధాని కోసం 33వేల ఎకరాల భూమిని ఇచ్చిన అమరావతి రైతుల నుండి భారీగా నిరనలు ఎదురయ్యాయి. ప్రభుత్వ చర్యను హైకోర్టులో సవాలు చేశారు అమరావతి రైతులు. 75పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం.. మార్చి 3, 2022న అమరావతిని ఆరునెలల్లో రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. కోర్టులు టౌన్ ప్లానర్లుగా, ఇంజనీరింగ్ కోర్టులుగా వ్యవహరించరాదని... హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో విశాఖకు రాజధానిని మార్చడం సులువవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com