AP : లా కాలేజీలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు

AP : లా కాలేజీలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు
X
లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ...లా కాలేజీ జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు

గుంటూరు జేసీ లా కాలేజీలో విద్యార్ధినుల పై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. ఫోన్లో, చాటింగ్‌లతో విద్యార్థినులను అసభ్యకర రీతిలో జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్ వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థుల ఫిర్యాదుతో జేసీ లా కాలేజీలో అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. మొత్తం 150 మంది విద్యార్థులను అధికారులు విచారించగా...9 మంది విద్యార్థినులు తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని కమిటీకి వివరించారు. లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ...లా కాలేజీ జూనియర్ అసిస్టెంట్ అరవింద్ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.

Tags

Next Story