AP : వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది : యరపతినేని

X
By - Vijayanand |25 Feb 2023 5:54 PM IST
వివేకా హత్యకేసులో ఒక్కో నిజం బయటికి వస్తుందన్నారు. ఏ కుటుంబంలో సొంత బాబాయిని చంపుకున్న సంస్కృతి లేదన్నారు
వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు. అందుకే ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ర్యాలీ సందర్భంగా బ్రహ్మారెడ్డి ట్రాక్టర్ ఎక్కారని కక్షగట్టి ఆ ట్రాక్టర్‌ను దగ్ధం చేశారన్నారు.
వివేకా హత్యకేసులో ఒక్కో నిజం బయటికి వస్తుందన్నారు. ఏ కుటుంబంలో సొంత బాబాయిని చంపుకున్న సంస్కృతి లేదన్నారు. చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com