AP: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తపై దాడి

AP: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తపై దాడి
X
నిన్న కారంపూడిలో గోరంట్ల నాగేశ్వరరావుపై దాడి ఘటన మరవక ముందే మాచర్లలో మరో యువకుడిపై దాడి

మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. నిన్న కారంపూడిలో గోరంట్ల నాగేశ్వరరావుపై దాడి ఘటన మరవక ముందే మాచర్లలో మరో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. సాయికిరణ్ అనే యువకుడిపై వైసీపీకి చెందిన వెంకటేష్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. టీడీపీలో తిరుగుతూ ర్యాలీలలో పాల్గొంటున్నందుకే తనపై దాడి చేశారని సాయికిరణ్‌ ఆరోపించాడు. దాడిలో గాయపడ్డ సాయికిరణ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Next Story