AP : లయన్స్ క్లబ్ సభ్యుల నిరసన

కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద లయన్స్ క్లబ్ సభ్యులు నిరసన తెలిపారు.. బొమ్మలూరులోని లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్‌ను కూల్చివేసేందుకు అధికారులు నోటీసులు ఇవ్వడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.. సర్వీసు సెంటర్లు పదిహేడేళ్లుగా ఉచిత నేత్ర, దంత చికిత్సలు అందిస్తున్నామని.. పది మందికి ఉపయోగపడే భవనాన్ని కూల్చివేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు.. అయితే, మాస్టర్ ప్లాన్ ప్రకారం టిడ్కో రోడ్డు నిర్మాణం కోసం భవనాన్ని కూల్చక తప్పదంటూ ఆర్డీవో చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.. ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు కూల్చివేయడం సరికాదని లయన్స్ క్లబ్ సభ్యులు మండిపడ్డారు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా ఆస్పత్రి భవనాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న పోరాటానికి ప్రజలు సహకరించి మద్దతు నిలవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com