AP : బీజేపీ నేతలతో పవన్ వరుస సమావేశాలు

AP : బీజేపీ నేతలతో పవన్ వరుస సమావేశాలు
X
అందరిని కలసిన తర్వాత అన్ని విషయాలు చెప్తామన్నారు పవన్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... బీజేపీ పెద్దలతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. కొద్ది సేపటి క్రితం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్‌ మురళీధరన్‌తో భేటీ ముగిసింది. ఈ భేటిలో బీజేపీ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ శివప్రకాశ్‌ కూడా ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. అనంతరం... మురళీధరన్‌ ఇంటి నుంచి వెళ్లిపోయారు కళ్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌. ఇంకా సమావేశాలు ఉన్నాయని.. అందరిని కలసిన తర్వాత అన్ని విషయాలు చెప్తామన్నారు పవన్‌.

Tags

Next Story