AP : డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మళ్లీ నిరసన సెగ

AP : డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మళ్లీ నిరసన సెగ
X
తిరుపతి జిల్లా కార్వేటి నగరంలో గడపగడప కార్యక్రమానికి వెళ్లిన నారాయణ స్వామిని సమస్యలపై మరోసారి మహిళలు నిలదీశారు

డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మళ్లీ నిరసన సెగ తగిలింది. తిరుపతి జిల్లా కార్వేటి నగరంలో గడపగడప కార్యక్రమానికి వెళ్లిన నారాయణ స్వామిని సమస్యలపై మరోసారి మహిళలు నిలదీశారు. గ్రామంలో అభివృద్ది శూన్యమని మండిపడ్డారు. మంత్రి అయ్యాక తమను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. గ్రామంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని ఆరోపించారు.ఇంటి పట్టాల్లో అవకవతకలపై నిలదీశారు స్థానికులు.మహిళల నిరసనను వీడియో తీయకుండా అడ్డుకున్నారు వైసీపీ కేడర్‌. మహిళల ఆందోళనతో నారాయణ స్వామి చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.నారాయణ స్వామి తీరుపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

Tags

Next Story