AP : నెల్లూరు జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయం

AP : నెల్లూరు జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయం
దుక్కి దున్నింది మొదలు.. పంట చేతికి వచ్చేదాక కష్టపడ్డ రైతులను.. దళారులు, మిల్లర్ల నిలువునా దోచుకుంటున్నారు

ఆంధ్రుల అన్నపూర్ణగా పిలువబడే నెల్లూరు జిల్లాలో అన్నదాతల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టించిన రైతన్నకు చివరికి కన్నీళ్లే మిగిలుతున్నాయి. దళారుల కారణంగా దోపిడికి గురవుతున్నారు. దుక్కి దున్నింది మొదలు.. పంట చేతికి వచ్చేదాక కష్టపడ్డ రైతులను.. దళారులు, మిల్లర్ల నిలువునా దోచుకుంటున్నారు. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర కల్పించకుండా మొత్తం పంటను లాగేసుకుంటున్నారు. చివరికి రైతుకు అప్పు తప్పా ఏమీ మిగలడం లేదు. ఇక కడపు మండి రైతులు రెడ్డెక్కుతున్నారు. అయితే అధికారులు విచారణ చేపట్టినా ఉపయోగం లేకుండా పోతుందు. ఎందుకంటే దోపిడి వెనుక ఉంది వైసీపీ నేతలేనని.. అందుకే విచారణ అర్థాంతరంగా ఆగిపోతుందని రైతులు వాపోతున్నారు.

తమ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ.. కేవలం మాటలకే పరిమితం అయ్యిందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయానికి బడ్జెట్‌ పేరుతో నూతన విధానాన్ని చేపట్టిన వైసీపీ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను మాత్రం అర్హులకు చేర్చడంలో విఫలం అయ్యిందంటున్నారు. వైసీపీ నేతలే ఆ సంక్షేమ పథకాలను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాలు దళారుల అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. అవినీతిపరుల జేబులు నింపుతున్న వ్యవసాయశాఖ అధికారులు.. పనిలో పనిగా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 2021-22 రబీ, ఖరీఫ్ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లలో నెల్లూరు జిల్లాలో భారీ అక్రమాలు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రాప్ నమోదు నుంచి ధాన్యం కొనుగోలు వరకు అవకతవకలు జరిగాయి. వైసీపీ నేతలు, మిల్లర్లు రైతుల ముసుగులో దోపిడీకి తెరలేపారు. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం తీసుకున్న దళారులు.. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించారని రైతులు చెబుతున్నారు.

ఈ దళారీ వ్యవస్థ వేధింపులు శ్రుతిమించడంతో రైతులు జాతియ రహదారులపై బయిటాయించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి ఉద్యమాలకు దిగడంతో ప్రభుత్వం దిగోచ్చింది. రైతలు నుండి ప్రతిఘటనలు, నిరసనలు ఎక్కువ కావడంతో రంగంలొకి దిగిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ కమిటి ప్రాదమిక విచారణలో సుమారు 36 కోట్ల విలువైన ధాన్యాన్ని విక్రయించింది నిజమైన రైతులు కాదని తేల్చారు. అధికార పార్టీ నేతలు రైతుల మనుగులో దోపిడీకి కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దీంతో వైసీపి ప్రభుత్వం బండారం బయటపడుతుందేమోనని రైతుల ముసుగులో ధాన్యాన్ని విక్రయించిన వారెవ్వరూ డబ్బులు తీసుకునేందుకు ముందుకు రాలేదని ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం నెల్లూరు జిల్లాలో మాత్రమే కాదని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆక్రమాలు వెలుగు చూశాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story