AP : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్ట్

AP : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్ట్
X

చలో విజయవాడలో పాల్గొనడానికి వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని రామకృష్ణ ఆరోపించారు. చలో విజయవాడకి పిలుపునిస్తే పోలీసులు అడ్డుకున్నారని ఆయన అన్నారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.డాక్టర్ అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి సిపిఐ పిలుపు ఇచ్చింది. ఒకపక్క జ్యోతిరావు పూలేకి దండలు వేస్తూనే... మరోపక్క దళితులు, బీసీల మీద దాడులు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు.

Tags

Next Story