AP : సీఎం జగన్ పర్యటనలో సమస్తం బంద్..!

సీఎం జగన్ పర్యటన అంటే ఏపీలో షాపులు మూయాల్సిందే. స్కూలు, కాలేజీలు బంద్ కావాల్సిందే. జనాలు ఇళ్లు దాటి బయటకు రాకూడదు.. రోడ్లపైకి ఏ ఒక్కరూ తిరగకూడదు. రోడ్డుకు ఇరువైపులా పరదాలు.. బారికేడ్లు ఉండాల్సిందే. ప్రజలు తమ గోడు చెప్పుకునేందుకు వీలుండదు.. సమస్యలు చెప్పుకుందామన్నా జనానికి ముఖ్యమంత్రి కలవరు. ఇది ఏపీలో సీఎం జగన్ జిల్లాల పర్యటన తీరు. అడుగడుగునా ఆంక్షలే కాదు.. ఇపుడు జగన్ వస్తున్నారంటే చెట్లు కూడా ఉండటానికి వీల్లేదు. అవును ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇవాళ ఈబీసీ నేస్తం రెండో విడత నగదును ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మార్కాపురం హెలిప్యాడ్ వద్ద ఉన్న పచ్చని చెట్లను అధికారులు తొలగించారు. హెలిప్యాడ్‌కు అక్కడి చెట్లు ఏమాత్రం అడ్డురావు. కానీ ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో ఉన్న చెట్లను నరికేశారు అధికారులు. హెలిప్యాడ్‌కు ఎంతో దూరంలో ఉన్న చెట్లను తొలగించడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com