AP : అర్థరాత్రి... ఓ యువకుడిని కారుతో ఢీకొట్టి, బెల్టుతో కొట్టిన వైసీపీ నేతలు

విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో వైసీపీ నాయకులు హంగామా చేశారు. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడిని కారుతో ఢీ కొట్టడంతోపాటు.. అతన్ని విచక్షణరహితంగా బెల్టుతో కొట్టారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమ కారుకు అడ్డంగా వచ్చినందుకు కొడుతున్నామని బుకాయించారు. కారుపై ఓ ఎంపీ స్టిక్కర్ కూడా ఉంది.
వైసీపీ నేతల ఆగడాలను స్థానికులు చిత్రీకరించారు. ఆ తర్వాత బరితెగించి దాడులకు పాల్పడతారా అంటూ వైసీపీ నేతలపై స్థానికులు తిరగబడ్డారు. యువకుడిని కారుతో ఢీకొట్టి బెల్టుతో కొట్టిన వైసీపీ నేతపై స్థానికులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సదరు వైసీపీ నేతను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కారుపై ఎంపీ స్టిక్కర్ ఉండటంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేసారు. వైసీపీ నేత వీరంగం సృష్టించడానికి అధికార పార్టీ బడా నేతలే కారణమని మండిపడ్డారు.
https://www.youtube.com/watch?v=PC6gYdRFbvU
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com