AP: ఆంధ్రప్రదేశ్ పాలనలో పవన్ ముద్ర

అసలు ఏముంది పవన్‌లో. ఇంతటి అభిమానం.. పరిమితులు లేని ప్రేమ.. ఎవరికీ లేనంత ఖ్యాతి ఆయనకు ఎలా సొంతమైంది. ఇదే ప్రశ్న జన సైనికులనో పవన్ భక్తులనో అడిగితే ఆగకుండా గంటలకొద్దీ సమాధానాలు వస్తూనే ఉంటాయి. వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలుగుందుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా తెరంగేట్రం చేసిన పవన్... చిరకాలంలోనే అన్న నీడ నుంచి బయటపడి అశేష అభిమాన గణాన్ని తయారు చేసుకున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందాడు. వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక అభిమానులను తయారు చేసుకున్న పవన్... తన వ్యక్తిత్వంతో అంతకంటే ఎక్కుమమంది భక్తులను తయారు చేసుకున్నాడు. భారత చలన చిత్ర పరిశ్రమలో పవన్‌కు ఉన్న ఆదరణ వేరే నటులకు లేదంటే అతిశయోక్తి కాదు. తన మాటతో.. ప్రవర్తనతో... నడవడికతో ఎందరికో ఆదర్శమయ్యారు.
పడిలేచిన కెరటం పవన్
సినిమాల్లో వందల కోట్ల రూపాయల ఆదాయం.... కాలు కిందపెట్టకుండా జీవించేంత లగ్జరీ.... చిటికేస్తే ఏ పన్నైనా చేసిపట్టే మంది మార్బలం ఇవన్నీ ఉన్నా.... పవన్ ఆ ఆడంబర జీవితాన్ని బతకలేక పోయాడు. తనకు అన్నీ ఇచ్చినా ప్రజలకు... అభిమాన గణానికి సేవా చేయాలన్న దృఢ సంకల్పంతో రాజకీయ రణరంగంలో దూకాడు. వందల కోట్ల రూపాయలను తృణ ప్రాయంగా వదిలేసి.. ప్రజా సేవే పరమావధిగా రాజకీయ రంగ ప్రవేశంచేశారు. అన్న మెగాస్టార్‌కి అండగా బరిలోకి దిగిన తొలిసారే పవన్‌కు నిరాశే ఎదురైంది. అయినా వెనుదిరగలేదు తనకు అన్నీ ఇచ్చినా ప్రజలక కొంతైనా చేయాలన్న తలంపుతో ప్రశ్నించడమే ప్రధాన అజెండాగా పార్టీని ప్రకటించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. వేరే వాళ్లయితే రాజకీయాలను అక్కడితో వదిలేసి...వేరే మార్గాన్ని ఎన్నుకునే వారు.కానీ అక్కడున్నది పవర్‌స్టార్. అగాథంలోనూ అద్భుతాలను, కటిక చీకటిలోనూ వెలుగు రేఖను వెతికే ఆ అసామన్యుడికి ఈ ఓటమి పెద్ద బాధ పెట్టలేదు. తనది పాతికేళ్ల రాజకీయ ప్రయాణమని ప్రకటించి.... మరొసటి రోజు నుంచే రాజకీయ రణరంగంలోకి దూకి ప్రజలకు మరింత చేరువయ్యాడు.తుఫాను దాటికి కౌలు రైతులు కుదేలైతే.... 30 కోట్ల రూపాయలతో తాను మరో కర్ణుడిని అని చాటుకున్నారు. అందుకే పవన్ అంటే భక్త జనానికి అంత ప్రాణం. పవన్‌తో కలిసి నడవాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.
జీతం మొత్తం అనాథలకే
పాలనలో తనదైన ముద్ర వేసేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై నిత్యం సమీక్షలు చేస్తూ… అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా తన నెల వేతనాన్ని ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం అందిస్తున్నారు. మిగిలిన వేతనం కూడా వారి బాగోగులకే ఖర్చు చేస్తున్నారు.
అభివృద్ధిపైనే దృష్టి
రాజకీయంగా కాకుండా అభివృద్ధి కార్యక్రమాల పరంగా కూడా పవన్ తనదైన ముద్ర వేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, రోడ్లు, మౌలిక సదుపాయాలపై పవన్ తీసుకున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. పల్లెప్రాంతాల్లో రహదారి అభివృద్ధి ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చిన పవన్, పాలనలో తన పాత్రను చాటారు. ఇది కూటమికి సాధ్యమైనంత బలాన్ని జత చేస్తున్నదిగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరోగా మాత్రమే కాకుండా, సమర్థవంతమైన పాలనా భాగస్వామిగా కూడా ఎదుగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com