AP : ఈనెల 27, 28న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు

AP : ఈనెల 27, 28న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు
X

టీడీపీ మహానాడును ఈనెల 27, 28వ తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. మహానాడు నిర్వహణ, నిర్ణయాలు, తీర్మానాలపై కమిటీలు వేసింది. మొత్తం 15 కమిటీలను అధిష్టానం నియమించింది. తీర్మానాల కమిటీలో యనమల సహా 14 మంది సీనియర్‌ నేతలు ఉన్నారు. వంద ఎకరాల స్థలంలో మహానాడు నిర్వహిస్తుంది. ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుస విజయాలు సాధించి టీడీపీ జోష్‌ మీద ఉంది. మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజకీయ కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలో సభ అంటే.. టీడీపీకి శుభమేననే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.

Tags

Next Story