AP : మాట నిలబెట్టుకో సీఎం జగన్ : ఉపాధ్యాయ సంఘాలు

AP : మాట నిలబెట్టుకో సీఎం జగన్ : ఉపాధ్యాయ సంఘాలు
శ్రీకాకుళంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతికంగా నినాదాలతో హోరెత్తించారు

సీపీఎస్‌ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని జగన్‌ వెంటనే నిలబెట్టుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి.. శ్రీకాకుళంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతికంగా నినాదాలతో హోరెత్తించారు. హామీలు అమలు చేయమంటే పోలీసు నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. బ్రిటీష్‌ కాలంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు లేవన్నారు. పోరాటాలకు పిలుపునిస్తే గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు.


Tags

Next Story