AP : గంజాయిపై ప్రధాని మోదీకి లోకేష్ ఫిర్యాదు

ఏపీలో గంజాయి మాఫియాపై ప్రధాని మోదీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. ప్రధానితో పాటు కేంద్ర హోంసెక్రటరీ అజయ్ భల్లాకు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్‌కు క్లంపైంట్ చేశారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా వాడకం.. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలపై వచ్చిన వార్తా కథనాలను ఫిర్యాదుకు జత చేసారు. అలాగే పాదయాత్రలో తల్లిదండ్రులు చెప్పిన మాటలను ప్రస్తావించారు.
డ్రగ్స్‌లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని.. పవిత్రమైన తిరుమల కొండపైన కూడా గంజాయి, డ్రగ్స్ సరఫ రా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి దందా వెనుక కొందరు వైసీపీ నేతలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నా యని తెలిపారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి దందాపై సమగ్ర విచారణ జరపాలని ప్రధాని మోదీని నారా లోకేష్ కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com