AP : అప్పులతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తోన్న జగన్ ప్రభుత్వం

AP : అప్పులతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తోన్న జగన్ ప్రభుత్వం
X

ఆంధ్ర ప్రదేశ్‌ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ప్రారంభిస్తోంది. నానా ప్రయత్నాలతో 3 వేల కోట్ల రుణం స్వీకరించేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందింది. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అప్పులకు కేంద్రం నుంచి ఇంత త్వరగా అనుమతులు రావడం అరుదైందే.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర పెద్దలు, అధికారులు సాగించిన ప్రయత్నాలతోనే ఈ అనుమతులు దక్కినట్లు తెలుస్తోంది. వచ్చే బుధవారం రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో 3 వేల కోట్ల రుణం తీసుకోనున్నారు. ఒక్క రాష్ట్రం మాత్రమే ఆ రోజు సెక్యూరిటీల వేలంలో పాల్గొంటోంది. ఆరేళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా వెయ్యి కోట్లు, తొమ్మిదేళ్ల కాలపరిమితితో తీర్చేలా వెయ్యి కోట్లు, పదేళ్ల కాలపరిమితితో చెల్లించేలా మరో వెయ్యి కోట్ల రుణం సమీకరిస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవడం... కేంద్రం నుంచి తాజాగా అనుమతులు రావడంతో.. 3 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశమేర్పడింది.

Tags

Next Story