AP : సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్

AP : సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్


సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు.. తమ హయాంలో కట్టిన ఇళ్లు ఇవే అంటూ చూడు జగన్‌ అంటూ చురకలు అంటిస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అన్నారు.

ఈ నాలుగేళ్లలో జగన్‌ కట్టిన ఇళ్లెన్ని అని ప్రశ్నించారు. ఇక నువ్వు కట్టిన ఇళ్లెక్కడ జవాబు చెప్పగలవా అంటూ జగన్‌ను ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఫొటోతో ట్వీట్ చేశారు. తన మైబైల్ ఫోన్‌తో స్వయంగా నెల్లూరు టిడ్కో ఇళ్ల సముదాయం ముందు సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని ఇప్పటికే టీడీపీ కేడర్‌కు, లీడర్లకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story