AP : క్యాసినోపై ఈడీకి వర్ల రామయ్య లేఖ

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఈడీకి లేఖ రాశారు.హైదరాబాద్, థాయ్‌ల్యాండ్ అక్రమ క్యాసినోల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. గుడివాడ కే-కన్వెన్షన్ సెంటర్‌లో 2022 జనవరిలో అక్రమంగా క్యాసినో నిర్వహించారని, అమాయక ప్రజల నుంచి ఐదు వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చీకోటి ప్రవీణ్ కూడా గుడివాడలో క్యాసినో నిర్వహించారని ఈడీకి రాసిన లేఖలో తెలిపారు. హైదరాబాద్,గుడివాడలో క్యాసినో నిర్వహించిన వారే.. థాయ్‌ల్యాండ్‌లో క్యాసినో నిర్వహించారని అన్నారు. అక్కడి ప్రభుత్వం అక్రమంగా క్యాసినో నిర్వహించిన వారి నుంచి దాదాపు వంద కోట్లు జప్తు చేసినట్లు వార్తలు వచ్చాయన్న వర్ల రామయ్య ..పెద్ద ఎత్తున జరుగుతున్న మనీలాండరింగ్‌తో దేశ ఆర్ధిక వ్యవస్థకు ముప్పు ఉందని అన్నారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈడీకి లెటర్ రాశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com