AP : రైతులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

AP : రైతులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు
పంట నష్టపోయిన రైతులకు బరోసా ఇస్తున్నారు చంద్రబాబు

పంట నష్టపోయిన రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా.. ధైర్యం చెబుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న రాత్రి కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చంద్రబాబు బసచేశారు. కాసేపట్లో రామచంద్రపురం మండలం వేగయమ్మపేటకు బయల్దేరతారు. అక్కడ దెబ్బతిన్న పొలాలను పరిశీలిస్తారు. రైతులను పరామర్శిస్తారు. అక్కడే రైతు పోరాట కార్యాచరణ ప్రకటిస్తారు. అక్కడి నుంచి 12.30 గంటలకు కడియం చేరుకుంటారు. కడియం ఆవ భూముల్లో పంట దెబ్బతిన్న రైతులతో మాట్లాడి నష్టాన్ని అడిగి తెలుసుకుంటారు.

మధ్యాహ్నం 3.15 గంటలకు కడియం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేమగిరిలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలిస్తారు. 4 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు చేరుకుని సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌గా ఉన్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, ఆమె మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులను ములాఖత్‌లో కలుస్తారు. అనంతరం తిలక్‌రోడ్‌లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇంటికెళ్లి ఆమెకు ధైర్యం చెబుతారు.

రైతులకు భరోసా కల్పించేలా అవసరమైతే మరికొన్ని రోజులు రాజమండ్రిలోనే ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ రాజమండ్రిలోనే ఉంటానని పార్టీ నేతలకు చెప్పిన ఆయన.. అప్పటి వరకు గ్రామాల్లో పర్యటనలు కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story