AP: ఏపీలో నిరుద్యోగులకు పండగే

AP: ఏపీలో నిరుద్యోగులకు పండగే
X
ఏపీలో నిరుద్యోగులకు లోకేష్ శుభవార్త... వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్... ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు.. యువత సిద్ధంగా ఉండాలన్న లోకేశ్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత ఉద్యో­గాల కల్ప­నే లక్ష్యం­గా పని­చే­స్తోం­ది. ఇప్ప­టి­కే పలు నో­టి­ఫి­కే­ష­న్లు వి­డు­దల చే­సిం­ది. అలా­గే ప్రై­వే­ట్ ఉద్యో­గా­ల­ను సైతం కల్పి­స్తుం­ది. ఐదే­ళ్ల­లో 20 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చా­ల­న్న లక్ష్యం­తో కూ­ట­మి ప్ర­భు­త్వం అడు­గు­లు వే­స్తోం­ది. ఇలాం­టి తరు­ణం­లో ఏపీ ఐటీ, ఎల­క్ట్రా­ని­క్స్, వి­ద్యా­శా­ఖల మం­త్రి నారా లో­కే­శ్ గు­డ్‌­న్యూ­స్ తె­లి­పా­రు. ని­రు­ద్యో­గు­ల­కు పం­డ­గ­లాం­టి తీ­పి­క­బు­రు చె­ప్పా­రు. జన­వ­రి­లో జాబ్ క్యా­లెం­డ­ర్ వి­డు­దల చే­య­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు. అంటే మరో నెల రో­జు­ల్లో జాబ్ క్యా­లెం­డ­ర్‌­ను వి­డు­దల చే­య­ను­న్నా­రు. ఈ జా­బ్‌­క్యా­లెం­డ­ర్ల ద్వా­రా ఎప్పు­డు, ఏ నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల కా­నుం­దో తె­లు­స్తోం­ది. ఈ సమా­చా­రం ప్ర­కా­రం ని­రు­ద్యో­గు­లు ప్లా­న్ చే­సు­కు­ని ప్రి­పే­ర్ అయ్యేం­దు­కు ప్ర­ణా­ళి­క­లు రచిం­చు­కు­నేం­దు­కు వీ­ల­వు­తుం­ది. ఏది ఏమై­న­ప్ప­టి­కీ జన­వ­రి­లో జాబ్ క్యా­లెం­డ­ర్ ప్ర­క­టి­స్తా­మ­ని మం­త్రి నారా లో­కే­శ్ ప్ర­క­టిం­చ­డం­తో ని­రు­ద్యో­గు­లు హర్షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో వి­ద్యా­ర్థుల ఉపా­ధి అవ­కా­శా­ల­ను మె­రు­గు­ప­రు­స్తా­మ­ని.. అం­దు­కే ‘నై­పు­ణ్యం’ అనే కొ­త్త పో­ర్ట­ల్‌­ను ప్రా­రం­భిం­చా­మ­న్నా­రు మం­త్రి లో­కే­ష్.

ఈ పో­ర్ట­ల్ ద్వా­రా వి­ద్యా­ర్థు­లు తాము నే­ర్చు­కు­న్న వి­ద్య­కు అను­గు­ణం­గా ఉద్యోగ అవ­కా­శా­లు ఎక్కడ ఉన్నా­యో తె­లు­సు­కో­వ­చ్చు అన్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ఐదే­ళ్ల­లో 20 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చ­డ­మే లక్ష్యం­గా పని­చే­స్తుం­ద­ని, "కూ­ట­మి ప్ర­భు­త్వం ఐదే­ళ్ల­లో ప్ర­భు­త్వ, ప్రై­వే­టు రం­గా­ల్లో 20 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చ­డ­మే లక్ష్యం­గా పని చే­స్తోం­ద­ని," అని మం­త్రి చె­ప్పా­రు. జన­వ­రి­లో జాబ్ క్యా­లెం­డ­ర్ వి­డు­దల చే­స్తా­మ­ని, "జన­వ­రి­లో జా­బ్‌ క్యా­లెం­డ­ర్‌ వి­డు­దల చే­స్తా­మ­న్నా­రు." అని తె­లి­పా­రు. రా­జ­మ­హేం­ద్ర­వ­రం ఆర్ట్స్ కా­లే­జీ­లో జరి­గిన కా­ర్య­క్ర­మం­లో ఇం­క్యు­బే­ష­న్ సెం­ట­ర్, ప్ర­ధాన ము­ఖ­ద్వా­రం, వం­దే­మా­త­రం ఉద్యా­నా­న్ని ప్రా­రం­భిం­చా­రు. ఎన్ని కే­సు­లు వే­సి­నా డీ­ఎ­స్సీ పూ­ర్తి చేసి 16 వే­ల­మం­ది­కి ఉద్యో­గా­లు ఇచ్చా­మ­న్నా­రు. ఇటీ­వల 6 వే­ల­మం­ది­కి కా­ని­స్టే­బు­ల్‌ ఉద్యో­గా­లి­చ్చా­మ­ని గు­ర్తు చే­శా­రు. రా­ష్ట్రా­ని­కి గూ­గు­ల్‌ డేటా సెం­ట­ర్‌, రి­ల­య­న్స్‌ డేటా సెం­ట­ర్‌.. కా­గ్ని­జెం­ట్‌­లో 25 వేల ఉద్యో­గా­లు ఇస్తా­మ­న్నా­రు.

Tags

Next Story