AP: ఏపీ చరిత్రను మలుపుతిప్పే భారీ ఒప్పందం

AP: ఏపీ చరిత్రను మలుపుతిప్పే భారీ ఒప్పందం
X
నేడు ఢిల్లీలో గూగుల్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. మారనున్న ఆంధ్రప్రదేశ్‌, విశాఖ రూపురేఖలు.. ఏపీ చరిత్రలో మైలురాయిగా ఒప్పందం

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర పా­రి­శ్రా­మిక, సాం­కే­తిక రం­గాల భవి­ష్య­త్తు­ను మా­ర్చే ది­శ­గా ఒక చా­రి­త్రా­త్మక ఘట్టం ఆవి­ష్కృ­తం కా­బో­తోం­ది. టె­క్నా­ల­జీ ది­గ్గ­జం గూ­గు­ల్, వి­శా­ఖ­ప­ట్నం­లో సు­మా­రు 10 బి­లి­య­న్ డా­ల­ర్ల (దా­దా­పు రూ.87,250 కో­ట్లు) భారీ పె­ట్టు­బ­డి­తో ‘గూ­గు­ల్ ఏఐ హబ్’ ఏర్పా­టు చే­సేం­దు­కు ముం­దు­కొ­చ్చిం­ది. దే­శం­లో­నే అతి­పె­ద్ద వి­దే­శీ ప్ర­త్య­క్ష పె­ట్టు­బ­డు­ల­లో ఒక­టి­గా ని­ల­వ­బో­తు­న్న ఈ మెగా ప్రా­జె­క్టు­కు సం­బం­ధిం­చి మం­గ­ళ­వా­రం న్యూ­ఢి­ల్లీ­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వం, గూ­గు­ల్ సం­స్థ ప్ర­తి­ని­ధుల మధ్య కీలక అవ­గా­హన ఒప్పం­దం (ఎం­ఓ­యూ) జర­గ­నుం­ది. ఈ ఒప్పం­దం­తో వి­శా­ఖ­ప­ట్నం దే­శం­లో­నే తొలి కృ­త్రిమ మే­ధ­స్సు (AI) నగ­రం­గా రూ­పాం­త­రం చెం­ద­నుం­ది. గత ఏడా­ది అక్టో­బ­ర్ 31న రా­ష్ట్ర ఐటీ శాఖ మం­త్రి నారా లో­కే­శ్ అమె­రి­కా పర్య­టన సం­ద­ర్భం­గా ఈ ప్రా­జె­క్టు­కు బీజం పడిం­ది. శా­న్‌­ఫ్రా­న్సి­స్కో­లో గూ­గు­ల్ క్లౌ­డ్ సీఈఓ థా­మ­స్ కు­రి­య­న్‌­తో జరి­పిన చర్చ­ల­లో ఏపీ­లో ప్ర­పం­చ­స్థా­యి ఏఐ ఎకో­సి­స్ట­మ్ ఏర్పా­టు­పై ప్ర­తి­పా­దన చే­శా­రు.

చంద్రబాబు, లోకేశ్ కృషితో...

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­నా­యు­డు బ్రాం­డ్ ఇమే­జ్, రా­ష్ట్ర ఐటి, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖల మం­త్రి నారా లో­కే­ష్ ని­రం­తర కృ­షి­తో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రూ­పు­రే­ఖ­లు మా­ర­బో­తు­న్నా­యి. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ భవి­ష్య­త్తు­ను మలు­పు­తి­ప్పే అతి­పె­ద్ద ప్రా­జె­క్టు­కు మం­గ­ళ­వా­రం న్యూ­ఢి­ల్లీ­లో అవ­గా­హన ఒప్పం­దం కు­ద­ర­నుం­ది. ఇది ఎపి చరి­త్ర­లో మై­లు­రా­యి­గా ని­ల­వ­బో­తోం­ది. భారత ఎఐ శక్తి­లో భా­గం­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ప్ర­భు­త్వం వి­శా­ఖ­ప­ట్నం­లో దే­శం­లో­నే తొలి కృ­త్రిమ మే­ధ­స్సు (AI) కేం­ద్రా­న్ని “గూ­గు­ల్ ఏఐ హబ్” పే­రు­తో శ్రీ­కా­రం చు­ట్ట­నుం­ది. వి­శా­ఖ­లో పది బి­లి­య­న్ అమె­రి­క­న్ డా­ల­ర్ల (సు­మా­రు రూ.87,250)తో గూ­గు­ల్ 1 గి­గా­వా­ట్ హై­ప­ర్‌­స్కే­ల్ డేటా సెం­ట­ర్ క్యాం­ప­స్‌ ఏర్పా­టు­కు సం­బం­ధిం­చిన ఎం­ఓ­యు­పై న్యూ ఢి­ల్లీ­లో సం­త­కా­లు చే­య­ను­న్నా­రు. ఇది భా­ర­త­దే­శం­లో­నే అతి­పె­ద్ద వి­దే­శీ ప్ర­త్య­క్ష పె­ట్టు­బ­డి (ఎఫ్ డిఐ)గా రి­కా­ర్డు సృ­ష్టిం­చ­బో­తోం­ది. న్యూ­ఢి­ల్లీ­లో­ని మాన్ సిం­గ్ హో­ట­ల్ లో మం­గ­ళ­వా­రం ఉదయం 10గం­ట­ల­కు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­నా­యు­డు, కేం­ద్ర సమా­చార, ప్ర­సార శాఖల మం­త్రి అశ్వ­నీ వై­ష్ణ­వ్, కేం­ద్ర ఆర్థి­క­మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, నారా లో­కే­ష్ సమ­క్షం­లో ఎపి ప్ర­భు­త్వ ప్ర­తి­ని­ధు­లు, గూ­గు­ల్ ఉన్న­త­స్థా­యి బృం­దం ఎం­ఓ­యు­పై సం­త­కా­లు చే­య­ను­న్నా­రు.

లోకేష్ అమెరికా పర్యటనతో...

రా­ష్ట్ర ఐటి, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖల మం­త్రి నారా లో­కే­ష్ అమె­రి­కా పర్య­టన సం­ద­ర్భం­గా గత ఏడా­ది అక్టో­బ­ర్ 31వతే­దీన శాన్ ఫ్రా­న్సి­స్కో లో గూ­గు­ల్ క్లౌ­డ్ సిఇఓ థా­మ­స్ కు­రి­య­న్ తో జరి­పిన చర్చ­ల్లో ఈ ప్రా­జె­క్టు­ను ప్ర­తి­పా­దిం­చా­రు. ఆ సమా­వే­శం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ప్ర­పం­చ­స్థా­యి ప్ర­మా­ణా­ల­తో ఎఐ ఎకో సి­స్ట­మ్ ఏర్పా­టు చే­య­డం­పై చర్చిం­చా­రు. ఆ తరు­వాత గూ­గు­ల్ ప్ర­తి­ని­ధు­ల­తో పలు­ద­ఫా­లు­గా జరి­గిన చర్చ­లు కా­ర్య­రూ­పం దా­ల్చా­యి. గూ­గు­ల్ ఏఐ హబ్ ద్వా­రా ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి గూ­గు­ల్ సం­స్థ పూ­ర్తి AI సాం­కే­తిక వే­ది­క­ను ఆతి­థ్యం ఇవ్వ­గల అవ­కా­శం లభి­స్తుం­ది. దీని ద్వా­రా భా­ర­త­దే­శం­లో కృ­త్రిమ మే­ధ­స్సు ఆధా­రిత అభి­వృ­ద్ధి­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కీలక నా­య­క­త్వం వహిం­చ­బో­తోం­ది. ఈ ప్రా­జె­క్ట్ ద్వా­రా గూ­గు­ల్ సం­స్థ రా­బో­యే అయి­దే­ళ్ల­లో సు­మా­రు 10 బి­లి­య­న్ అమె­రి­క­న్ డా­ల­ర్ల పె­ట్టు­బ­డి పె­ట్ట­నుం­ది. ఇది ఆసి­యా­లో­నే గూ­గు­ల్ చే­ప­ట్టే అతి పె­ద్ద ప్రా­జె­క్టు­ల­లో ఒక­టి­గా ని­లు­స్తుం­ది. రా­ష్ట్ర ప్ర­భు­త్వ అం­చ­నాల ప్ర­కా­రం, ఈ ప్రా­జె­క్టు రా­ష్ట్ర ఆర్థిక వ్య­వ­స్థ­పై గణ­నీ­య­మైన ప్ర­భా­వా­న్ని చూ­ప­నుం­ది. 2028-2032 మధ్య కా­లం­లో ఏటా సగ­టున రూ.10,518 కో­ట్ల­ను రా­ష్ట్ర జీ­ఎ­స్‌­డీ­పీ­కి చే­ర్చ­నుం­ది. ప్ర­త్య­క్షం­గా, పరో­క్షం­గా సు­మా­రు 1,88,220 ఉద్యో­గాల కల్పన జరు­గు­తుం­ద­ని అం­చ­నా. అం­తే­కా­కుం­డా, గూ­గు­ల్ క్లౌ­డ్ ఆధా­రిత ఉత్ప­త్తుల ద్వా­రా ఏటా రూ.9,553 కో­ట్ల అద­న­పు ఆదా­యం సమ­కూ­ర­నుం­ది. మొ­త్తం ఐదే­ళ్ల­లో దా­దా­పు రూ.47,720 కో­ట్ల ఆర్థిక లక్ష్యా­న్ని చే­రు­కుం­టుం­ద­ని భా­వి­స్తు­న్నా­రు. ఈ ప్రా­జె­క్టు­కు ఇటీ­వల ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన రా­ష్ట్ర పె­ట్టు­బ­డుల ప్రో­త్సా­హక మం­డ­లి (ఎస్‌­ఐ­పీ­బీ) సమా­వే­శం­లో ఆమో­దం లభిం­చిం­ది. ప్రా­జె­క్టు­ను వే­గం­గా పట్టా­లె­క్కిం­చేం­దు­కు సిం­గి­ల్ విం­డో క్లి­య­రె­న్స్, పు­న­రు­త్పా­దక ఇంధన వన­రు­లు, ప్ల­గ్-అండ్-ప్లే సౌ­క­ర్యా­లు కల్పిం­చేం­దు­కు ప్ర­భు­త్వం సి­ద్ధ­మైం­ది.

Tags

Next Story