AP ACB: ఈ ఉద్యోగి అక్రమాస్తులు రూ. 70 కోట్లపైనే
వైసీపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా 2019-24 మధ్య పని చేసిన వైద్యారోగ్య శాఖ ఉద్యోగి గొండు మురళి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. 2019 నుంచి 2022 వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో మురళి..కుటుంబసభ్యుల పేరిట భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. 20 ఎకరాలకు పైగా భూమి, విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువులను వీటి మార్కెట్ విలువ రూ.70 కోట్లకు పైగా ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం అక్రమాస్తుల కేసులో మురళిని అరెస్టు చేశారు. సారవకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గొండు మురళి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వద్ద పీఏగా చేరారు. ధర్మాన వద్ద పని చేసినంతకాలం ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షలు వసూలు చేశారని.. ఇసుక, అభివృద్ధి పనులు అన్నింట్లోనూ కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com