AP: కొత్త జిల్లాల్లో పరిపాలన షురూ..

AP: కొత్త జిల్లాల్లో పరిపాలన షురూ..
X
కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన సర్కార్... ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాలు... పోలవరం కలెక్టర్‌‌గా A S దినేష్ కుమార్... మార్కాపురం  కలెక్టర్‌‌గా రాజబాబు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో కొ­త్త జి­ల్లా­లు, రె­వె­న్యు డి­వి­జ­న్లు ఏర్పా­టు, పలు మం­డ­లాల సరి­హ­ద్దు­లు మా­ర్పు­లు చే­ర్పు­లు చే­స్తూ రా­ష్ట్ర ప్ర­భు­త్వం తుది నో­టి­ఫి­కే­ష­న్ జారీ చే­సిం­ది. సీఎం చం­ద్ర­బా­బు హామీ ఇచ్చి­న­ట్లు­గా రా­ష్ట్రం­లో 2 కొ­త్త జి­ల్లా­లు ఏర్పా­టు చే­స్తూ నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­సిం­ది. రం­ప­చో­డ­వ­రం హెడ్ క్వా­ర్ట­ర్​​­గా పో­ల­వ­రం జి­ల్లా ఏర్పా­టు చే­స్తూ ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. మా­ర్కా­పు­రం హెడ్ క్వా­ర్ట­ర్​​­గా మా­ర్కా­పు­రం జి­ల్లా ఏర్పా­టు చే­స్తూ ఆదే­శా­లు ఇచ్చిం­ది. కొ­త్త జి­ల్లా­లు అమ­ల్లో­కి వస్తా­య­ని తుది నో­టి­ఫి­కే­ష­న్ల­లో తె­లి­పిం­ది. 2 కొ­త్త జి­ల్లాల ఏర్పా­టు­తో రా­ష్ట్రం­లో మొ­త్తం జి­ల్లాల సం­ఖ్య 26 నుం­చి 28కి పె­రి­గిం­ది. మద­న­ప­ల్లి కేం­ద్రం­గా జి­ల్లా ఏర్పా­టు చే­స్తా­మ­ని సీఎం హామీ ఇచ్చిన నే­ప­థ్యం­లో అన్న­మ­య్య జి­ల్లా హెడ్ క్వా­ర్ట­ర్​­ను రా­య­చో­టి నుం­చి మద­న­ప­ల్లి­కి మా­ర్చా­రు. ప్ర­జ­ల­కు వే­గం­గా పాలన అం­దిం­చ­డం, సు­ప­రి­పా­ల­నే లక్ష్యం­గా రా­ష్ట్రం­లో కొ­త్త జి­ల్లా­లు ఏర్పా­టు చే­సిన ప్ర­భు­త్వం కొ­త్త­గా 5 రె­వె­న్యూ డి­వి­జ­న్ల­నూ ఏర్పా­టు చే­సిం­ది. పలు మం­డ­లాల సరి­హ­ద్దు­ల­నూ మా­ర్చిం­ది. ప్ర­జల కో­రిక మే­ర­కు సమీప జి­ల్లా­ల్లో కలి­పిం­ది. కొ­త్త­గా రె­వె­న్యూ డి­వి­జ­న్లు­గా అన­కా­ప­ల్లి జి­ల్లా­లో అడ్డ­రో­డ్డు జం­క్ష­న్, ప్ర­కా­శం జి­ల్లా­లో అద్దం­కి, అన్న­మ­య్య జి­ల్లా­లో పీ­లే­రు, శ్రీ సత్య­సా­యి జి­ల్లా­లో మడ­క­శిర, నం­ద్యాల జి­ల్లా­లో బన­గా­న­ప­ల్లి రె­వె­న్యూ డి­వి­జ­న్లు కొ­త్త­గా ఏర్పా­టు చే­స్తూ ప్ర­భు­త్వం తుది నో­టి­ఫి­కే­ష­న్ జారీ చే­సిం­ది.

కలెక్టర్, ఎస్పీ నియామకం

కొ­త్త­గా ఏర్పా­టైన పో­ల­వ­రం, మా­ర్కా­పు­రం జి­ల్లా­ల్లో కలె­క్ట­ర్, జా­యిం­ట్ కలె­క్ట­ర్, ఎస్పీ­ల­ను ని­య­మి­స్తూ ప్ర­భు­త్వం ఉత్త­ర్వు­లు సైతం జారీ చే­సిం­ది. పో­ల­వ­రం కలె­క్ట­ర్ గా అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా కలె­క్ట­ర్ A S ది­నే­ష్ కు­మా­ర్ కు ఇం­చా­ర్జ్ వి­ధు­లు ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. ఇక మా­ర్కా­పు­రం కలె­క్ట­ర్ గా ప్ర­కా­శం జి­ల్లా కలె­క్ట­ర్ రా­జ­బా­బు కు అద­న­పు బా­ధ్య­త­లు అప్ప­గిం­చా­రు. పో­ల­వ­రం ఎస్పీ గా అల్లూ­రి జి­ల్లా ఎస్పీ అమి­త్ బర్డ­ర్‌­కు అద­న­పు బా­ధ్య­త­లు అం­దిం­చా­రు. మా­ర్కా­పు­రం ఎస్పీ గా ప్ర­కా­శం జి­ల్లా ఎస్పీ హర్ష­వ­ర్ధ­న్ రా­జు­కు, పో­ల­వ­రం జా­యిం­ట్ కలె­క్ట­ర్ గా అల్లూ­రి జా­యిం­ట్ కలె­క్ట­ర్ తి­రు­మ­ణి శ్రీ పూజ కు అద­న­పు బా­ధ్య­త­లు అం­దిం­చా­రు. మా­ర్కా­పు­రం జా­యిం­ట్ కలె­క్ట­ర్ గా ప్ర­కా­శం జా­యిం­ట్ కలె­క్ట­ర్ రో­ణం­కి గో­పా­ల­కృ­ష్ణ కు ఇం­చా­ర్జ్ బా­ధ్య­త­లు ఇచ్చా­రు. ఈ మే­ర­కు ప్ర­భు­త్వం ఆయా జి­ల్లా­ల్లో కలె­క్ట­ర్, జేసీ, ఎస్పీ కా­ర్యా­ల­యా­ల­ను నో­టి­ఫై చే­స్తూ ఉత్త­ర్వు­లు వి­డు­దల చే­సిం­ది.

కొ­త్త జి­ల్లా­ల­కు కలె­క్ట­ర్లు, జే­సీ­లు వచ్చే­దా­కా ఉమ్మ­డి జి­ల్లా అధి­కా­రు­లే ఇన్‌­చా­ర్జు­లు­గా కొ­న­సా­గ­ను­న్నా­రు. డి­సెం­బ­ర్ 31 నుం­చి అన్న­మ­య్య జి­ల్లా కా­ర్య­క­లా­పా­లు మద­న­ప­ల్లి కా­ర్య­క్ర­మా­లు నేటి నుం­చి ప్రా­రం­భం కా­ను­న్నా­యి. ఇప్ప­టి­వ­ర­కు రా­య­చో­టి నుం­చి పని­చే­సిన జి­ల్లా కలె­క్ట­ర్, ఎస్పీ, ఇతర జి­ల్లా అధి­కా­రుల కా­ర్యా­ల­యా­లు నేటి నుం­చి మద­న­ప­ల్లె నుం­చి జరు­గు­తా­యి. గత వై­సీ­పీ ప్ర­భు­త్వం జి­ల్లాల వి­భ­జన చే­ప­ట్ట­గా.. అం­దు­లో పొ­ర­పా­ట్లు ఉన్నా­య­ని టీ­డీ­పీ ప్ర­భు­త్వం ఆరో­పిం­చిం­ది. తాము అధి­కా­రం­లో­కి వచ్చాక మా­ర్పు­లు చే­స్తా­మ­ని తె­లి­పిం­ది. అం­దు­కు అను­గు­ణం­గా ఇప్పు­డు కొ­త్త జి­ల్లా­ల­తో పాటు కొ­న్ని జి­ల్లాల కేం­ద్రా­ల్లో మా­ర్పు­లు చే­సిం­ది.

సరిహద్దులు మార్పులు

సరి­హ­ద్దుల మా­ర్పు­ల­కు సం­బం­ధిం­చి తుది ప్ర­క­టన జారీ చే­సిం­ది. 5 రె­వె­న్యూ డి­వి­జ­న్ల ఏర్పా­టు­తో వాటి సం­ఖ్య 77 నుం­చి 82కు చే­రా­యి. కొ­త్త­గా 2 కొ­త్త మం­డ­లా­ల­ను ఏర్పా­టు చే­శా­రు. ఆదో­ని 1, ఆదో­ని 2 మం­డ­లాల ఏర్పా­టు­తో రా­ష్ట్రం­లో మం­డ­లాల సం­ఖ్య 679 నుం­చి 681కి పె­రి­గా­యి. పె­ను­గొండ మం­డ­లా­న్ని వా­స­వీ పె­ను­గొం­డ­గా మా­ర్చా­రు. నం­ది­గామ మం­డ­లా­న్ని పలాస రె­వె­న్యూ డి­వి­జ­న్‌ నుం­చి టె­క్క­లి­కి మా­ర్చా­రు. సా­మ­ర్ల­కోట మం­డ­లా­న్ని కా­కి­నాడ డి­వి­జ­న్‌ నుం­చి పె­ద్ద­పు­రా­ని­కి మా­ర్చా­రు. పా­డే­రు కేం­ద్రం­గా అల్లూ­రి సీ­తా­రా­మ­రా­జు జి­ల్లా రీ­స్ట్ర­క్చ­ర్‌ చే­స్తూ ఉత్త­ర్వు­లు ఇచ్చా­రు. పె­ను­గొం­డ­ను వా­స­వీ పె­ను­గొం­డ­గా మా­రు­స్తూ తుది నో­టి­ఫి­కే­ష­న్‌ జారీ చే­శా­రు. ఇప్ప­టి వరకు అం­బే­డ్క­ర్‌ కో­న­సీమ జి­ల్లా­లో ఉన్న మం­డ­పేట ని­యో­జ­క­వ­ర్గం తూ­ర్పు­గో­దా­వ­రి జి­ల్లా­లో భా­గ­మ­వు­తుం­ది. ఈ ని­యో­జ­క­వ­ర్గం­లో­ని మం­డ­పేట, రా­య­వ­రం, కపి­లే­శ్వ­ర­పు­రం మం­డ­లా­లు రా­మ­చం­ద్రా­పు­రం రె­వె­న్యూ డి­వి­జ­న్‌ నుం­చి రా­జ­మ­హేం­ద్ర­వ­రం రె­వె­న్యూ డి­వి­జ­న్‌­లో వి­లీ­న­మ­వు­తా­యి.

అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తున్నారు. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటవుతోంది. ఇందులో అద్దంకి, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్‌తోపాటు ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలు డివిజన్‌తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలుస్తాయి.

Tags

Next Story