Jogi Brothers : జోగి బ్రదర్స్ కు 4 రోజుల కస్టడీ.. మొత్తం బయటపడనుందా..?

Jogi Brothers : జోగి బ్రదర్స్ కు 4 రోజుల కస్టడీ.. మొత్తం బయటపడనుందా..?
X

ఏపీలో సంచలనం రేపిన కల్తీ లిక్కర్ కేసు మీద సిట్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన వైసీపీ నేతల కుట్రలను సెట్ బయట పెడుతూనే ఉంది. మొదట్లో తమకేం సంబంధం లేదని తెగ ప్రమాణాలు చేసిన జోగి రమేష్ అతని సోదరులు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రమాణాలు చేస్తే చేసిన పాపాలు పోవు కదా. అందుకే సిట్ వాళ్లను అరెస్టు చేసి కీలక విషయాలను రాబట్టేందుకు నాలుగు రోజుల కస్టడీని కోరింది. ఇందుకు కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నేటి నుంచి నాలుగు రోజులపాటు సిట్ వాళ్లను విచారించనుంది.

ఈ కేసులో జోగి బ్రదర్స్ కు, అద్దేపల్లి బ్రదర్స్ తో ఉన్న సంబంధాలు, కల్తీ లిక్కర్ కు ఎక్కడ బీజం పడింది అనే కోణంలో మొట్టమొదటగా ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఈ కల్తీ లిక్కర్ కు ఆద్యుడు ఎవరు, ఎవరి సపోర్టుతో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా నడిపించారు, వచ్చిన డబ్బులను ఆన్ లైన్ ద్వారా కాకుండా క్యాష్ రూపంలో చెల్లించేందుకు ఎలాంటి ప్లాన్ అమలు చేశారు, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది అనేది పోలీసులు విచారించబోతున్నారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడి గురించి కూడా పోలీసులు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోగి బ్రదర్స్ కు వచ్చిన డబ్బులను ఎవరికి ట్రాన్సక్షన్ చేశారు అనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే జోగి బ్రదర్స్ చాలా కుంగిపోయి కనిపిస్తున్నారు. ఈ కేసులో తమను ఇరికించాలని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు జోగి బ్రదర్స్ ఇప్పటికే పసిగట్టారు. అందుకే తాము ఒక్కరమే ఇరుక్కోకుండా ఈ కేసులో ఉన్న అందరినీ బయట పెట్టేందుకు వాళ్ళు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీలోని అంతిమ లబ్ధిదారుడి పేరు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో ఈ కేసు గురించి పూర్తి వివరాలను జోగి రమేష్ బయటపెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏపీలో కల్తీ లిక్కర్ పేరుతో ప్రజల ప్రాణాలతో ఆటలాడిన అంతిమ లబ్ధిదారుడును త్వరలోనే నిందితుడిగా నిలబెట్టే పనిలో పోలీసులు ఉన్నారు.



Tags

Next Story