AP News: సెక్యూరిటీ బాండ్ల వేలం.. వేయి కోట్ల అప్పు..

AP News (tv5news.in)

AP News (tv5news.in)

AP News: ఒకటో తారీఖు గండం గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది.

AP News: ఒకటో తారీఖు గండం గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది. 7.2 శాతం వడ్డీతో ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసింది. ఈ వెయ్యి కోట్లలో 500 కోట్లను 15 ఏళ్లలో, ఇంకో 500 కోట్లను 16 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంది.

అటు.. ఢిల్లీ చుట్టూ తిరిగి సెప్టెంబరు 3వ తేదీన కేంద్రం నుంచి 10వేల 500 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునేందుకు అనుమతి పొందారు. మంగళవారం ఇందులో 10వేల కోట్లు తెచ్చేసుకున్నారు. మిగిలింది 500 కోట్లు మాత్రమే. ప్రతిసారి ఒకటో తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేసే పరిస్థితి నెలకొంది.

ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలందించడం కోసం ప్రభుత్వం నిధుల వేట మొదలు పెట్టినట్టుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అప్పుగా తెచ్చిన వెయ్యి కోట్లను ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఉపయోగించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు 5వేల 500 కోట్లు కావాలి. తాజాగా తెచ్చిన అప్పు వెయ్యి కోట్లే. ఒకటో తారీఖు వచ్చేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపు నిధుల వేట ఎలా కొనసాగిస్తారు? జీతాలు, పెన్షన్లకు సరిపడా డబ్బులు ఎలా సమకూర్చుకుంటారో వేచి చూడాల్సిందే

Tags

Read MoreRead Less
Next Story